Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలను దష్టిలో పెట్టుకొని వరంగల్ తూర్పు నియోజకవర్గం యువ త కోసం నన్నపనేని నరసింహమూర్తి ట్రస్టు ద్వారా ఉచిత శిక్షణతో పాటు భోజనం మెటీరియల్ అందిస్తున్నా మని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే తండ్రి జ్ఞాపకార్థం మేరకు ఎన్ఎన్ ట్రస్ట్‌ను వరంగల్ చౌరస్తాలోని రాధా క్రిష్ణ గార్డెన్ లో తూర్పు నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర ్లతో కలిసి ట్రస్ట్ లోగో కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాప కార్థం ట్రస్టు ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రజలకు మరింత సేవ చేయాలని తన సతీమణి వాణి, కుమారుడు లోకేష్ పటేల్ ఆధ్వర్యంలో సామాజిక సేవలు చేపడు తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా యువత మంచి భవి ష్యత్తుకు బాటలు వేయాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామ న్నారు. విద్యార్థులకు శిక్షణ తో పాటు వారికి కావలసిన మెటీరి యల్ భోజన వస తు లు కూడా అందిస్తామని అన్నారు. జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవ్వగానే జూలై 1 నుండి క్లాసులు ప్రారం భమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.