Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షురాలు లైలా
నవతెలంగాణ-వరంగల్
ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షురాలు లైలా అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాల యంలో కలెక్టర్ డాక్టర్ బి.గోపిని మర్యాద పూర్వకంగా ఆమె కలిశారు. ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ తమ కమ్యూనిటీ కి ప్రభుత్వం తరపున సహాయ సహాకారాలు అందించాలన్నారు. కమ్యూనిటీ వారికి గుర్తింపు కార్డు లు ఇవ్వాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సం దర్భంగా లైలా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కోట శ్రీవాత్స, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సలహా దారుడు ఈ.వి. శ్రీనివాస్‌రావు, కమ్యూనిటీ ప్రతినిధులు వి.రిమిషా, వి.పూర్ణిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.