Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలిచ్చిన ఇండ్ల స్థలాలను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-నర్సంపేట
ఇటుకాలపెల్లి గ్రామంలో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చిన ప్రదేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ. వెంకట్ డిమాండ్ చేశారు. మండలంలోని ఇటుకాలపెల్లిలోని 2005లో 96 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి ఇండ్లు మంజూరు చేసిందన్నారు. నాడు పెరిగిన ఇంటి సామాగ్రి ధరలతో ఇండ్లకు ఇచ్చిన యూనిట్ డబ్బులు సరిపోక పేదలు ఇండ్లను నిర్మించుకోలేకపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చి స్థలాలు ఇల్లు లు నిర్మించి ఇస్తారని ఆశపడ్డ పేదలకు నిరాశే మిగిలిందని అన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి 2014లో 1,400ల ఇండ్లు ఇండ్లు మంజూరు అయ్యా యని ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ఈ నియోజకవర్గంలో నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేదలంటే పేదల సమస్యలు అంటే కిందటి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. పేదలను వంచించడంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రుజువు చేసుకుందని ఎద్దేవజేశారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మరో వైపు పోడు సాగు చేసుకొంటూ యేండ్ల తరబడి వాటిపై ఆధారపడి బ్రతుకుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక కులాలకు చెందిన పేదలకు హక్కు పత్రాలు ఇవ్వడంలోనూ ఈ ప్రభుత్వం వివక్ష చూపుతం దన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రోజంటికీ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని దాని ఫలితంగా సామాజిక తరగతులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపో తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటకాలపల్లి గ్రామంలో ఇంటి స్థలాలు కేటాయించి వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, వరంగల్ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, రైతు సంఘం నాయకులు ఈసంపెల్లి బాబు, నాయకులు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధీర్, నాయకులు హన్మకొం శ్రీధర్ గ్రామ కార్యదర్శి ఎస్కే. అన్వర్, పెండ్యాల సారయ్య, బస్కే మొగిలి, విజరు బాబు, గజ్జి మల్లేష్, చేరాలు, అనుముల రాధ, గర్వందుల ప్రమీల, ఎదులాపురం బాబు తదితరులు పాల్గొన్నారు.