Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)కేంద్రకమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
గుడిసెవాసులకు నివాస పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య. బీ.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని 601 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను సీపీఐ(ఎం) నాయకత్వ బృందం సందర్శిం చింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిధిగా నాగయ్య వెంకట్ మాట్లా డారు. పట్టణంలో నిలువనీడలేని నిరుపేదలు కొన్నాళ్ల క్రితం సర్వే నెంబర్ 601లోని ప్రభుత్వ భూమిలో పేదలు ఇండ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వం పేదలకు నివాస స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చి మాట తప్పిందని విమర్శించారు. ఇండ్లు కాదు కదా జానెడు జాగా కూడా ఇవ్వలేదన్నారు. పేదల పక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని, పేదలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడే ఉండి ప్రభుత్వం సమస్యలను పరిష్కరి స్తుందని మాయ మాటలు చెబుతూ ఎన్నిమిదేండ్లగా కాల యాపన చేస్తూ వచ్చిందన్నారు. ఇండ్ల స్థలాలు, ఇండ్లు లేక పేదలు అనేక ఇక్కట్ల కు గురివుతుంటే పట్టించు కోకపో వడం శోచనీయ మన్నారు. పేదలకు 60 గజాల జాగను ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వానికి మనసు కు రాకపోవడం దుర్మార్గమ న్నారు. భూ ఆక్రమణదారులు ఆక్రమిం చుకున్న భూములకు మాత్రం అధికారులు అండగా నిలుస్తూ కట్టబెట్టాలని ప్రయత్నిం చడం అన్యాయ మన్నారు.పేదలు ప్రభుత్వ భూములను గుర్తించి గుడిసెలు వేస్తుంటే వారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా అరెస్టు చేస్తూ భయబ్రాం తులకు గురి చేయడం సరైందికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలని పట్టణంలో 601 సర్వే నెం బర్ ప్రభుత్వ బూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టా లు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు గుజ్జు ల ఉమా, గడ్డమీది బాలకష్ణ, కందికొండ రాజు, నాయకు లు ఎండీ ఫారిదా, వజ్జంతి విజయ, సింగారపు బాబు, ఉద యగిరి నాగమణి, గణిపాక ఇంద్ర, బిట్ర స్వప్న, తాళ్లపెల్లి ప్రవళిక, లక్ష్మి, అనిల్, యాకలక్ష్మి, రాజు, పాల్గొన్నారు.