Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
గ్రామంలో నూతన సీసీ రోడ్లను నిర్మించాలని సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి పెంతల నరేష్ అన్నారు. మండలం పరిధిలోని ధర్మరావుపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 7వార్డును వారు సందర్శించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ వార్డులో పూర్తిగా మట్టిరోడ్లు కావడంతో వర్షాకా లంలో రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గ్రామంలో ఉన్న పశు వైద్యశాల ఈవార్డులో ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే పశువుల రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసమై బురదమ యంగా మా రుతున్నాయి. ఇదే విషయంపై అనేకసార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు సింగిరెడ్డి విజేందర్, పొన్నాల తరుణ్, తదితరులు పాల్గొన్నారు.