Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలావరంగల్
నర్సంపేట పట్టణంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా బాలాజీ టెక్నో స్కూల్ అడ్మిషన్ ప్రారంభించి క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, వెంటనే ఈ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని వరంగల్ డీఈవో కార్యాలయంలో డీఈవో వాసంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉదాసీనత వైఖరి వల్ల ఇలాం టి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. స్కూల్ అనుమతి లేకుండా నడపడం పిల్లల తల్లిదండ్రులను మోసం చేయడమే నన్నా రు. బాలాజీ టెక్నో స్కూల్ పై అధికార యంత్రాంగం వెంటనే విచారణ జరిపి ఆ స్కూల్ రద్దు చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్, తరుణ్ ప్రవీణ్, రాజు, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.