Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-వరంగల్
హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బందు నిధులు మంజూరు చేసి నేరుగా రైతు ఖాతాలో జమచేయలంటూ బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు నిధులు ఇప్పటికీ రైతుల ఖాతాలోకి జమ కాలేదని తెలిపారు. దీంతో జిల్లాలోని రైతులు ప్రైవే టుగా అప్పులు చేసి ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తు న్నారని అన్నారు. రైతులు పండించిన పంటలు దళారికి, వ్యాపారులకు అమ్మితే మిగిలేది ఏమి ఉండదని, రైతుల పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోం దన్నా రు. ప్రభుత్వం ఏటా రైతాంగానికి ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందజేయాలని తెలిపారు. కార్యక్ర మంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి మహ్మద్ ఆయుబ్, బొజ్జ సమ్మయ్య యాదవ్, జిల్లా కిస్సాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్, పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన
ములుగు : రైతులకు పంట పెట్టుబడికి రైతుబంధు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు రైతుబంధు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరుతూ బుధవారం కలె క్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యా లయం ఏఓ కు వినతి పత్రం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని లేనియెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పళ్లి రాజేందర్ గౌడ్,ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ రవి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యా దవ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వాకిటి రామ కష్ణ రెడ్డి,సుడి సత్తి రెడ్డి, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, మైస ప్రభాకర్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంపాల ప్రభాకర్. ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కష్ణ,మాజీ ఎంపీపీ కణతల బుజ్జి, శ్రీనివాస్‌రెడ్డి,ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కోటి, పెండెం శ్రీకాంత్ పాల్గొన్నారు.