Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్
- హనుమకొండలో నిరసన ర్యాలీ
నవతెలంగాణ-హన్మకొండ
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా టైల్స్ మార్బుల్, గ్రానైట్ పాలిష్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ లోని ఏకశిలా పార్కు నుంచి కాళోజీ విగ్రహం వరకు బుధవారం నిరసనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళోజీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మి కుల కూలీల రేట్లు పెంచుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం మూడ్రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా టైల్స్ మార్బుల్ గ్రానైట్ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలి పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మార్బుల్ గ్రానైట్, టైల్స్ కార్మి కుల బతుకులు ఇబ్బందిగా మారినట్టు తెలి పారు. ఈ క్రమంలో 30 శాతం కూలీ రేట్లను పెంచాలని గహ యజమానులను, బిల్డర్లను, కాంట్రాక్టర్లను కోరారు. కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ టైల్స్ యూనియన్ అధ్యక్షుడు సునీల్ ప్రసాద్, హనుమకొండ టైల్స్ అధ్యక్షులు కే అశోక్, యుగేంధర్, అధ్యక్షులు రవి, రాజ స్థాన్ మార్బుల్ యూనియన్ అధ్యక్షు లు సుభాష్ షైనీ, భీమ్ రాజ్ ప్రమోద్, మార్బుల్ యూనియన్ అధ్యక్షులు యాకూబ్ పాషా, మీర్జా ఫయాజ్, ఎస్కే ఖాజా, ఫాతిమానగర్ మార్బుల్ యూనియన్ అధ్యక్షుడు పాండు రవి, పాల్గొన్నారు.