Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మంగీలాల్ నాయక్
నవతెలంగాణ-బయ్యారం
రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు10శాతం రిజర్వేషన్లు కల్పించాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మంగీలాల్ నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆ సంఘం జాతీయ సమ్మేళన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజనుల పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని, జీఓ నెంబర్ 3 ను పునరుద్ధరించాలని, బోర్ బోలి భాషను 8 వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. జులై 1న మహబూబాద్ జిల్లా కేంద్రంలో యశోద గార్డెన్లో జరిగే లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ సమ్మేళనాన్ని, 25 వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.