Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-జనగామ
త్రివిధ దళాల్లో సైనికుల నియామకం కోసం ప్రధాని మోడీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. లేదంటే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు. బుధవారం జనగామ పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ పాల్గొని మాట్లాడారు. నాడు కిసాన్లపై నేడు అగ్నిపథ్ పేరుతో జవాన్లకు ఎసరు పెట్టారని అన్నారు. అగ్నిపత్ అమలు ఇలాగే కొనసాగిస్తే దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లుతుంద న్నారు. ఈ విషయాన్ని పలువురు మాజీ సైనికాధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సబ్కా వికాస్, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క హామీని నిలుపుకోలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు. ఎక్కడా ఉద్యోగ అవ కాశాలు కల్పించలేని మోడీ ప్రభుత్వం చివరకు సైన్యంలో చేరే వారికి కూడా పెన్షన్ లేకుండా, నాలుగేళ్ల కాలపరిమితికి తీసుకుంటామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. నాలు గేండ్ల తర్వాత అగ్నివీర్ సైనికులు, వారి కుటుంబాల భవి ష్యత్ ఏమిటని ప్రశ్నించారు. ఆతర్వాత వారు సెక్యూరిటీ గార్డులుగా, దోభీలుగా, బార్బర్లుగా, వంటవాళ్లుగా స్థిరప డతారని బీజేపీ నాయకులు ప్రకటనలు చేయడం దివాళాకోరుతనమన్నారు. ఇప్పటిదాకా సైన్యంలో పనిచేసి వచ్చిన వారికి సమాజంలో ఒక గౌరవం వుండేదని ఇకపై ఆ పరిస్థితి వుండదని అన్నారు. అగ్నిపథ్ ఉపసంహరించు కునేదాకా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలకు వామపక్ష పార్టీలు సంపూర్ణంగా మద్దతును ఇస్తాయని చెప్పారు. అమెరికాలో కాంట్రాక్టు పద్దతిలో సైనికులు వుంటారని చెప్పేవారని, ఇప్పటిదాకా అమెరికా ఏ యుద్దంలో విజయం సాధించిందో చెప్పాలన్నారు. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏ దేశంలోనూ అమెరికా గెలవలేకపోవడానికి కారణం అందులో వుండే కాంట్రాక్టు సైనికులేనని అన్నారు.సైన్యంలో ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు నో ర్యాంక్-నో పెన్షన్ అంటోందని విమర్శించారు. అనంతరం అగ్నిపథ్ నిరసన కార్యక్రమంలో పోలిస్ కాల్పుల్లో మతిచెందిన రాకేష్‌కు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్, ఎన్నకుస కుమార్, జోగు ప్రకాష్, కొలిపాక యాకయ్య, రమేష్, బెల్లంకొండ వెంకటేష్, చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.