Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
సంఘం బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కషి చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి సైదులు అన్నారు. బుధవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం కేవీపీఎస్ తొర్రూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్ష కార్యదర్శులుగా పస్తం భాస్కర్, డోనుక దర్గయ్యను ఎన్నుకున్నట్లు సైదులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , కార్యదర్శులు భాస్కర్, దర్గయ్య మాట్లాడుతూ... దళితుల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అహర్నిశలు కషి చేస్తామని అన్నారు. తమపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పజెప్పినందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడతామని అన్నారు. ఈ సమావేశంలో డీ శ్రీరాములు, జీ చిరంజీవి, ఈదురు సతీష్, మంగళపల్లి బిక్షపతి, బొల్లికొండ ఉపేందర్, తప్పెట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.