Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధిస్తున్నాడంటూ తొమ్మిదో భర్తపై ఫిర్యాదు
- పోలిస్‌స్టేషన్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
భర్త తనను వేధిస్తున్నాడంటూ మానుకోట మహిళా పోలిస్స్టేషన్లో భార్య ఫిర్యాదు చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసి పోలిస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన ఘటన మహబూబాబాద్‌లో బుధవారం వెలుగుజూసింది. వివరాల్లోకెళ్తే... హైదరాబాద్‌లో ఉంటున్న మహబూబాబాద్‌కు చెందిన స్వప్న ఇంజినీరింగ్ చదివింది. 2019లో మ్యాట్రిమోనీలో కష్ణా జిల్లా గంపలగూడెం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. తన పెళ్ళి సంభందం కుదర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాదిని వెంటబెట్టుకుని ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్ళి సంభందం మాట్లాడుకున్నారు. 10 ఏప్రిల్ 2019లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. బెంగళూరులో నివాసముంటుండగా రెండు నెలల్లోనే మనస్పర్థలు వచ్చాయి. స్వప్న తరుచూ ఫోన్లో మాట్లాడుతూ కోర్టు విషయాలలో తలమునకలై ఉండేది. ఇదేంటని భర్త ప్రశ్నిస్తే గొడవపడేది. ఈక్రమంలో ఓ రోజు బెంగుళూరు నుంచి ఆకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్ళాలని పట్టుబడిందని, వెళ్ళి వచ్చాకా మళ్ళీ వెళ్ళాలని అనడంతో అనుమానం వచ్చిన భర్త ఆరా తీయగా ఆమెకు అప్పటికే ఎనిమిది మందితో వివాహమైందని తేలింది. ఇద్దరితో విడాకులు తీసుకుందని, ఒకరు చనిపోయారని మరికొందరు ఆన్లైన్లో ఉన్నారని భర్త వెంకటేష్ వాపోయాడు. స్వప్న ఇతరులను వివాహం చేసుకున్న ఫోటోలు రెండు పాన్ కార్డులు ఇద్దర్ని విడాకులు తీసుకున్న పత్రాలు వీడియో చూపించాడు. తొమ్మిదో పెండ్లికి తను మోసపోయానని ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. దీంతో ఆ ఖిలాడీ లేడీ భర్త పై కోపంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయిం చింది. దీంతో నివ్వెర పోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. చివరకు మహబూబూబాద్ పోలిస్స్టేషన్లోలో బాధిత భర్తకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. కాగా పోలీసులు తన కేసు పట్టిం చుకోవడం లేదంటూ స్వప్న జిల్లా ఎస్పీ శరచ్చంద్రకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు.