Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి ప్రసాద్
నవతెలంగాణ- స్టేషన్‌ఘన్‌పూర్
టీఆర్ఎస్ ప్రభుత్వపు ఎనిమిదేండ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ పరిధి లోని మెగా లెదర్ పార్కుని పూర్తిగా విస్మరించిందని, దళితులను అడుగడుగునా మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి.ప్రసాద్ విమర్శించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని నమిలిగొండ శివారులోని మెగా లెదర్ పార్కును ఆ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి లెదర్ పార్కుని ఏనిమిదెండ్ల పాలనలో పట్టించుకోలేదని అన్నారు. పార్కు ప్రారంభించినట్టైతే 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 5వేల మంది దళిత యువతకు ఉపాధి లభించేదని అన్నారు. తద్వారా రాష్ట్రమంతటా లెదర్ పరిశ్రమను అభివద్ధి చేసే అవకాశం కూడా ఉన్నదన్నారు. నాడు ప్రభుత్వం లెదర్ పరిశ్రమను అభివద్ధికి ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 70 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించిందని అన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం ఇతర కార్యాలయాలు, అభివద్ధి పేరిట స్థలాన్ని మళ్ళించే ప్రయత్నం చేసిందని అన్నారు. గతంలో దళితులకిచ్చిన భూముల్ని గ్రామ అభివద్ది పేరిట లాక్కున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితులందరికీ ప్రత్యేక శిక్షణ పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని, 25 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేస్తామని మోసం చేసిందని అన్నారు. దళిత యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రస్తుతం జిల్లా మంత్రి, ఎమ్మెల్యే పునరాలోచించాలని, లెదర్ పార్కును పునర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అవసరైమతే ఇతర దేశాల్లోని శాస్త్ర, సాంకేతిక రంగాన్ని పరిశోధన చేసి, రాష్ట్రంలోని దళిత యువతకు ఉపాధి కల్పించడంలో పెద్ద పరిశ్రమ ను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. దళిత సమాజానికి ఇచ్చిన హమీలన్ని సాధించే వరకు దళితులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సింగరపు రమేష్, ప్రధాన కార్యదర్శి ఎదునూరి వెంకట్రాజం, ఎన్నకూస కుమార్, మత్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ , నాయకులు గంగాపురం మహేందర్, సోమ సత్యం, భూశెట్టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.