Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రవీందర్ డిమాండ్
నవతెలంగాణ-ములుగు
పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అంటే మెస్ చార్జీలు పెంచాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జంపాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వంట కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ కు, డీఈవో పాణినీ కి బుధవారం వినతి పత్రాలు అందించారు. అనంతరం సామల రమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, తెలం గాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నుండి ఆదాయం ఉన్నా లేకున్నా వంట చేస్తు న్న వంట కార్మికులను అలాగే కొనసాగించాలని, ఈ మధ్యలో గ్రామాలలో జరుగుతున్న గ్రూపుల సమస్యలను సర్పంచ్లు పరిష్కరించాలని కోరారు. అధికారులు కూడా వారిని కొనసాగిం చే విధంగా కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జున రావు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి నరసయ్య, సామల రమ, గుణాల రాజకుమారి, పోరెడ్డి ప్రమీల, కొర్ర సమ్మక్క, పోదెం సమ్మక్క, ఆసరి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.