Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
వర్షాకాలంలో వర్షాలు పడితే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో నరసింహమూర్తి, తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. తాడిచెర్ల మండల పరి షత్ కార్యాలయంలో మండల, గ్రామీణ స్థాయి ఉపాధి హామీ, హరితహారం, వరదల జాగ్రత్తలు, గ్రామాల్లో క్రిడా మైదానాల గుర్తింపు, పారిశుద్ధ్యం, వందశాతం ఇంటిపన్ను వసూలు,విద్యుత్ అంతరాయం, సమస్యలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5వ విడత హరి తహారంలో భాగంగా మండలంలో అన్ని గ్రామాల్లో ఇంటింటా 6 మొక్కలు పంపిణీ చేసి వాటిని ప్రజలు నా టి సంరక్షణ చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఎస్సై సత్యనారాయణ,ఎంపీవో విక్రమ్ కుమార్, పాల్గొన్నారు.