Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లాలో 3.15 లక్షలలో ఎకరాల వ్యవసాయం సాగు
- పత్తి, కంది వేయాలని చెబుతున్న ప్రభుత్వం
- రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం వ్యవసాయ సాగులో చూసినట్లయితే పత్తితో పాటు కంది పంట ఎక్కువగా పండిస్తున్నట్టు వ్యవసాయాధికారులు అంచ నాలు వేస్తున్నారు. జిల్లాలో ఒక సుమారుగా 3.15 లక్షల ఎకరాలలో పంటలు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంట 1.21 లక్షల లో ఎకరాలు, వరి 1.31, మిర్చి 16 వేల ఎకరాలు, మొక్క జొన్న 22 వేల ఎకరాలు, కంది, పెసర వంటి పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 202-22 తో పోలిస్తే ఈ సంవత్సరం 2022-23లో పత్తి పంట వైపు రైతులు మొగ్గు చూపడంతో అదనంగా జిల్లాలో 12 వేల ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నా రన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముందస్తుగా క్షేత్రస్థాయిలో విత్తనాలు దుకాణాలను పోలీస్ ఎన్ఫోర్స్ మెంట్ టీంలతో పాటు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థా యిలో పర్యటించి నకిలీ విత్తనాల ను గుర్తించి కేసులు పెట్టడం గమనార్హం. జిల్లా లో 13 మండలాల్లో 12 మంది వ్యవసాయ అధికారులు ఉన్నారు. అయిదు వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండటం తో క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులను చైతన్య చేయడంతో పాటు భూసార పరీక్షలు చేయించే దిశగా అడుగులు పడటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.రైతులు స్వయంగా అధికారుల సలహాలు తీసుకుని పంటలు సాగుచేయాలని అదేవిధంగా నకిలీ విత్తనాలపై రైతులు అవగాహన కలిగి ఉండటం వలన నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని పంటలు పండిస్తూ అధిక దిగు బడి తోపా టు లాభాలు చేకూరుతాయన్నారు. సంవత్సరం కొకసారి పంట మార్పిడి చేయాలని అధికారులు చెబు తున్నారు. రైతులకు ప్రభుత్వం చైతన్య సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు
జిల్లాలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మ కుండా ముందస్తుగా పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిం చడంతో నకిలీ విత్తనా లను చాలా వరకు అరికట్టాం. గడవు ముగిసిన విత్తనాలు దుకాణాల్లో ఉండటంతో ఆయా దుకాణాల పై చర్యలు తీసుకు న్నాం. రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు ఇచ్చి రైతులను చైతన్య వంతులుగా చేస్తున్నాం.
- జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్