Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-సంగెం
తెలంగాణలో దళితుల పేదరిక నిర్మూలన కోసం అంబేద్కర్ కలలు గన్న రాజ్యం కోసం దళిత బంధు పథ కాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం మం డలం లోని ఆశాలపల్లి క్రాస్‌లోని కూచన ఫంక్షన్హాల్లో ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులతో దళితబంధు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మండలం లో గ్రామాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. దళితబంధు పథకంలో కు టుంబం సభ్యులంతా కొత్త ఆలోచనలతో వారి జీవితాలు మార్చుకోవాలని పిలుపు నిచ్చారు. అప్పులు తీసుకున్న చేతులతోనే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిం చారు. కుటుంబంలో ఒకే వ్యా పారం కాకుండా రెండు వ్యాపారాలు పెట్టుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. దళితవా డల్లో తిరిగే ప్రతిపక్ష నాయకులను తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం దళిత బంధు లబ్ధిదారుల తో ముఖాముఖి కార్యక్రమంలో వారికి ఉన్న సమస్యలు, పథకం ద్వారా కలిగే ఊరటలు, ప్రయోజనాలు అడిగిన సందర్భంలో లబ్ధిదారులు భావోద్వేగానికి గుర య్యారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎంపిపి కందగట్ల కళావతి, జెడ్పిటిసి గూడ సుదర్శన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, ఎంపీడీవో మల్లే శం, మండల దళిత బంధు కన్వీనర్ బొమ్మల శంకర్, సొసైటీ చైర్మన్లు వేల్పుల కుమారస్వామి, దొమ్మటి సంపత్, వెంక టేశ్వర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.