Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్టింగ్ రేట్లు పెంచాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్
- ఆర్ట్స్ కాలేజి -కలెక్టరేట్ వరకు ర్యాలీ
నవతెలంగాణ-సుబేదారి
మార్బుల్ టైల్స్, గ్రానైట్, పాలిష్ కార్మికులకు ఫిట్టింగ్ కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గహ నిర్మాణ పనులు బంద్ చేసి సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ధర్నాకు ముందు ఆర్ట్స్ కాళేజీ ఆడిటోరియం నుండి డిమాండ్లతో కూడిన ప్లకార్డ్స్ పట్టుకొని హన్మకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, మార్బుల్ టైల్స్ యూనియన్ అధ్యక్షులు యాకూబ్ పాషా, సునీల్ మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో టైల్స్ కటింగ్ మిషన్ రేట్లు పెరిగాయని, ఫిట్టింగ్ రేట్లను 30 శాతం పెంచుతున్నట్టు తెలిపారు. దీనికి బిల్డర్స్ గహ యజమానులు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పని భద్రత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టైల్స్ మార్బుల్ గ్రానైట్ కార్మికులకు ద్విచక్ర వాహనాలను అందించాలని, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన రేట్లు జూలై 1 నుండి అమలులోకి వస్తాయని యూనియన్ నేతలు తెలిపారు. మార్బుల్ యూనియన్ నాయకులు మీర్జా ఫయాజ్, ఎస్కే కాజా, టైల్స్ యూనియన్ అధ్యక్షులు అశోక్ ,యుగంధర్ ప్రమోద్, ఫాతిమా, యూనియన్ నాయకులు పాండు ,లక్ష్మణ్, రాజస్థాన్ మార్బుల్ యూనియన్ అధ్యక్షులు సుభాష్ షైనీ ,భీమ్ రాజ్, ప్రమోద్, సమీర్ పాల్గొన్నారు.