Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దివాలాకోరు విధానాల వల్ల దళితుల బతుకులు చితికిపోతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత అన్నారు. గురువారం జనగామ పట్టణంలో బొట్లఏలెంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లలిత పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వా లు దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా దళి తులకు ప్రత్యేక ప్రణాళిక కానీ బడ్జెట్ కేటాయింపులు గాని, సంక్షేమానికి ఖర్చు పెట్టే ప్రణాళికా కేటాయింపులు కానీ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 7ఏండ్ల పాలనలో సంక్షేమం కుంటుపడిందని అన్నారు. నాలుగేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, సబ్సిడీలు రావడంలేదని అన్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో సుమారు 80 కులదురహంకార హత్యలు జరిగాయన్నారు. వీటిని నివారించడంలో విఫలం చెందిందని అన్నారు. కులాంతర వివాహాలకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా ఉన్న భూమిని గుంజుకునేస్థితికి వచ్చిందన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు బొట్ల ఎలెంద్ర , ఉపాధ్యక్షులు కొత్తపెళ్లి రామ ఎర్ర అనిత, ప్రధాన కార్యదర్శి కుంటి అన్నపూర్ణ, సహాయ కార్యదర్శులు బొట్ల అరుణ ,శాడసునీత, బత్తిని సుకన్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.