Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలం భిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రత్యామ్నాయంగా, ప్రజా సంక్షేమానికి వామపక్ష పార్టీలే ఆధారమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి సోమయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వేజెళ్ళ సైదులు రావు భవనంలో పార్టీమండల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. తుడుసు యాదగిరి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. సోమయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సామాన్య మానవుని నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి సామాన్యుడికి పంచుతానని చెప్పి అంబానీ, ఆదాని లాంటి కుబేరులను తయారుచేయడానికి కంకణం కట్టుకున్నాడని అన్నారు. అగ్ని పథ్ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. గతంలో రైతుల వీరోచిత పోరాటాల ఫలితంగా గత్యంతరంలేని పరిస్థితులలో రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ కూడా దేశాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పై ప్రజలు పెంచుకున్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వత మరమ్మతులు ఆచరణలో కాగితాలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వత మరమ్మత్తులతో పాటు శిధిలమైన డ్రాప్లను పూర్తిచేసి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా కార్యవర్గ సభ్యులు మండా రాజన్న, మెరుగు వెంకన్న, ఎం. మోహన్, ఎం.వేణు, పెంటయ్య, జె. యాకయ్య, ఎస్.రామచంద్రుడు, ఎం.మారయ్య, చిన్న మారయ్య, యం. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.