Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
లోకకల్యాణార్థం శ్రీ భూనీల సమేత శ్రీ లక్ష్మి వెంక టేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. శుక్రవారం కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక ఉన్న ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల య నిర్మాణం కొరకు మా వంతు విరాళంగా రూ.40 లక్షలను శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ అకౌంట్ లో జమ చేశామని తెలిపారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు తోచిన విధంగా ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్మన్ పల్లపు శోభ రఘుపతి రావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్ కౌన్సిలర్లు ముం జంపల్లి మురళి, నూనె రాజు, పిల్లలమర్రి శారద నారాయణ, ముంజలా రవీందర్ గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బండారి రవి పైడి పల్లి రమేష్, తిరుపతమ్మ, స్వప్న, రజిత, తదితరులు పాల్గొన్నారు.