Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-నర్సంపేట
విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన బాలాజీ టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పొన్నాల తరుణ్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఎఫ్ఐ పట్టణ విస్తత స్థాయి సమావేశంలో యార ప్రశాంత్ మాట్లాడారు. పట్టణంలోని ద్వారకపేట రోడ్డులో విద్యా శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా బాలాజీ టెక్నో స్కూల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. టెక్నో స్కూల్ పేరిట మాయమాటలు చెప్పి అధికార, డబ్బు అండదండలతో తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థుల ప్రవేశాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. పట్టణంలో నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను మరిపించేలా అధిక ఫీజులు వసూళ్లు చేసి యాజమాన్యం మోసగిస్తుందని విమర్శించారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా విద్యా శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాలను నిర్వహిస్తున్నా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం బాధ్య తారహిత్యమన్నారు. విద్యా హక్కు చట్టం, విద్యా శాఖ నిబంధనలను పాటిం చని పాఠశాలలను వెంటనే పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని అధికా రులను డిమాండ్ చేశారు. లేనిపక్ష్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేప ట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, శ్రీకాంత్, శ్రీనివాస్, కృష్ణ, సాగర్, తిరుపతి,మురళి తదితరులు పాల్గొన్నారు.