Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే.
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-రేగొండ
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర 97వ రోజు గురువారం మండలం గోరి కొత్తపల్లి, చిన్నకొడే పాక, చెన్నపూర్, రేగొండ, బాగిర్తిపేట, మడ్తపల్లి, పొన గల్లు, రెపాక గ్రామాల్లో కొనసాగింది. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాదండి దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో భాగంగా రేగొండలో బీఎస్పీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనవసరమైన ప్రాజెక్టులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నిం చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య ఒప్పందం చేసుకు న్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ప్రజలు గమనించాలని అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరో పణలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం పథకాల పేరుతో లాక్కుంటుంది అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి పొన్నం భిక్షపతి, జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ సదన్ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజేష్, మండల కన్వీనర్ కొయ్యడ దామోదర్, నాయకులు ఈర్ల సురేష్ ప్రవీణ్, భాస్కర్ పాల్గొన్నారు.