Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గని మేనేజర్లకు వినతి పత్రాలు
- ధర్నాను విజయవంతం చేయండి
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణిలో ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే నింపాలని, అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్కు సర్ఫేస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్( ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి ఏరియాలోని గని మేనేజర్లకు వినతి పత్రాలు అందిం చారు. సింగరేణిలో క్లరికల్, ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ను రద్దు చేయాలని, ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే భర్తీ చేయాలని డిమాండ్లతో శుక్రవారం జిఎం కార్యాలయం ముందు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం భూపాల పల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ ఫిట్ అయిన ఓవర్ మెన్, సర్దార్,షార్ట్ ఫైరర్ లకు సర్ఫేస్ లో సుటేబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. సింగరేణి మైనింగ్ స్టాఫ్ పాయింట్ లైన్ సూపర్వై జర్లకు, అధికారులకు, కార్మికులకు మధ్య వారధిగా ఉండి ఉత్పత్తి లక్ష్యసాధనకు కషి చేస్తున్నారని అన్నారు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్ పల్లికి చెందిన హెడ్ ఓవర్ మెన్ ప్రసాదరావును మెడికల్ బోర్డు అండర్ గ్రౌండ్ లో పని చేయడానికి అనర్హుడిగా ప్రకటించారని, తిరిగి తనని ఉద్యోగానికి ఫిట్ చేసి సూటబుల్ జాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేటీకే 1 ఇంక్లైన్ నుండి ఓవర్ మెన్ మురళీ ధర్, నరేష్ , రాజారాం, పోచం, ఆర్ వి రావు, సదానందం, అజరు, రవితేజ, రాజేష్ బాబు, జి శ్రీనివాస్ , హైమత్ , మాటీటీ శ్రీనివాస్ ,చిప్ప నరసయ్య,సేఫ్టీ కమిటీ, మైనింగ్ కమిటీ, కేటీకే- 5 నుండి ఎండి. ఆసిఫ్ పాష, పి .రామన్న, పి. నారాయణ మూర్తి, శ్రీనివాస్, బుద్ధవరపు రాయమల్లు, ఆషాడం రంగయ్య, కేటీకే- 6 ఇంక్లైన్ నుండి మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ లక్ష్మణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.