Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-మట్టెవాడ
నన్నపునేని నర్సింహమూర్తి ట్రస్ట్ స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం పేదలకు సేవ చేయడమే అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నగరం లోని మహేశ్వరిగార్డెన్లో బుధవారం ఎమ్మెల్యే నాన్నగారైన నర్సింహమూర్తి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం సందర్బంగా గురువారం ఎమ్మెల్యే, వారి సతీమణి వాణి, కుమారుడు లోకేష్ పటేల్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా నాన్న జన్మనిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్జన్మనిచ్చా రన్నారు.. తన తండ్రి ముఖ్యమంత్రి పేరు నిలబెట్టే విదంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని శిక్షణ తరగతులు నేటి నుండి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, పాల్గొన్నారు..