Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉపాధ్యా యులు నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దాలని స్థానిక ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. గురువారం మండలంలోని ఇల్లంద ప్రాథమిక పాఠశాలను జడ్పిటిసి మార్గం బిక్షపతి, ఎం ఈఓ రంగయ్యలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా పాఠశాల అభివద్ధి పనులపై అరా తీసి ఉపాధ్యా యుల కు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల చేత అభ్యాసం చేయించారు. పిల్లలతో కలిసి ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంఈఓలు మధ్యాహ్న భోజనం చేశారు. రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని పిల్లలకు ప్రధానోపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎంసి చైర్మన్ కుమారస్వామి, ఉన్నారు.