Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని మూడు చెక్కలపల్లిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసర ప్రాంతాలను, వంటశాలలో భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణ, పిల్లల చదువు, భోజనం గురించి సూచనలు చేశారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యరీత్యా ఏఎన్ఎం సౌకర్యం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలపగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట డిటిడివో వరంగల్, హెచ్ఎం, వార్డెన్, ఉపాధ్యాయ బందం, ఉన్నారు.