Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అకాడమిక్ అధికారి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని ప్రతి పాఠశాలలో విధిగా బ్రిడ్జీ కోర్సు అమలు చేసి బడిఈడు పిల్లలను బడిలే చేరేవిధంగా ఉపాధ్యా యులు పని చేయాలని జిల్లా విద్యాశాఖ అకడమిక్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో బాగంగా గురువారం మండలంలోని మంగపేట, కమలాపురం, తిమ్మంపేట, మంగపేట జడ్పీహెచ్ఎస్, కమలాపురం సిపి నగర్, అంబేడ్కర్ నగర్, తోండ్యాల, గంపోని గూడెం ఎంపీపీ ఎస్, కోమటిపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలను సందర్శించి గ్రామ విద్యా నమోదు పుస్తకం నిర్వహణ తీరును పరిశీలించి ఉపాద్యాయులకు సూచనలు చేశారు. బడి ఈడు పిల్లలు విధిగా పాఠశాలలో నమోదు అయ్యేలా ప్రతి ఉపాద్యాయుడు భాద్యత తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలలో విధిగా బ్రిడ్జి కోర్స్ ను అమలు చేయాలని ఆదేశించారు. ములుగు వెలుగు యాప్ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు హాజరు నమోదు చేయాల న్నారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి వివరాలు (విఈఆర్)లో నమోదు చేసి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంబం చేసిన ఇంగ్లీష్ మీడియం విద్యా భోధన గురించి విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమం ఎంఈఓ లకావత్ రాజేష్ కుమార్, సీఆర్పీలు నగేష్ తదితరులు పాల్గొన్నారు.