Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని రేలకుంటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పోరిక వెంకటేష్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించగా పార్టీ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును గురువారం నర్సంపేట ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబ సభ్యుల సంక్షే మంపై ప్రభావం పడదని పార్టీలో సాధారణ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం పొందిన సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.