Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఊడుగుల సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశవం కోర్ కమిటీ సభ్యులతో మాత్రమే నిర్వహించారు. వచ్చిన అధికారులు ఎంపీపీ అనుమతితో నివేదికలను మం డల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చదివి వినిపించారు. ఏవో పరమేశ్వర్ మాట్లాడుతూ పంట సాగు వివరాలు, విత్తన కేంద్రాల, రైతు బంధు పథకం, రైతు భీమా పథకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల గురించి, పంటలపై అవగాహన సద స్సులపై వివరించారు. తహసీల్దార మాట్లాడుతూ మండలంలోని రేషన్ షాపుల నిర్వహణ, ఆహార భద్రత కార్డులు, కొత్త ఆహార భద్రత కార్డుల దరఖా స్తు, కళ్యాణ లక్ష్మి పథకం గురించి, రేషన్ షాప్ లో బియ్యంతో పాటు చక్కెర ఇవ్వడంలేదని కమిటీ సభ్యులు తెలుపగా పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే నెల నుండి చక్కెర ఇచ్చే విధంగా చూస్తామని చెప్పారు. మిషన్ భగీరథ గురించి ఏ ఈ వివరణ ఇవ్వగా స్థానిక ఎంపీటీసీ జన్ను జయరాజు మండల కేంద్రంలో ఇతర గ్రామాలలో మిషన్ భగీరథ మంచి నీరు అందడం లేదని పైపులైన్లు పూర్తిగా వేయ కుండా పాత మంచినీటి సరఫరా పైపులైన్ల ద్వారా అందిస్తున్నారన్నారు. ఎం ఈ ఓ చదువుల సత్యనా రాయణ నివేదిక తెలుపుతూ పలు పాఠశాలల్లో నూతన మన అడ్మిన్లు ఎక్కువగా మన వరంగల్ జిల్లాలో మన మండలం ప్రథమ స్థానంలో ఉందని, మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలకు పనుల నిమిత్తం 15 శాతం డబ్బులు వచ్చాయని అన్నారు. వైద్య సిబ్బంది వచ్చే సీజనల్ వ్యాధుల గురించి తగు జాగ్రత్తలు తీసుకొని ముందు చూపుతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ సభకు హాజరు కాని మండల అధికారులకు నోటీసులు పంపిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజరు, తహసీల్దార దూలం మంజుల, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, ఎం పీ డీవో ఆఫీస్ సూపరిండెంట్, పాల్గొన్నారు.