Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలాజీ టెక్నో స్కూల్‌ను మూసేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా ధ్యక్షులు శివరాత్రి ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో పీ.పవన్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భం గా శివరాత్రి ప్రశాంత్ మాట్లాడుతూ పట్టణం లోని ద్వారకపేట రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బాలాజీ టెక్నో స్కూల్ పేరుతో నిర్వహిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని తెలి పారు. అను మతి లేని పాఠశాలలలో విద్యార్థులు చద వడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే అవ కాశం ఉం దని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా తగు చర్య లు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం అన్యా యమన్నారు. టెక్నో పేరిట మాయమాటలు చెబుతూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ దోపిడికి పాల్పడుతూ యజమాన్యం తమ ఇష్టారాజ్యంగా వ్యవV ారిస్తుందని విమర్శించారు. నిబంధనలను కాలరాస్తూ యధేశ్ఛగా పాఠశాలను కొనసాగించడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. వెంటనే స్పందించి బాలాజీ టెక్నో స్కూల్‌ను మూసేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి మహేష్, ప్రశాంత్, రాకేష్, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.