Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని దౌలత్నగర్కు చెందిన ఐలపాక మల్లి కాంబకు భూమి విషయంలో న్యాయం చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య శుక్రవారం తహసీల్దార్ అజ్మీరా కోమీకి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరే షన్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన భూమిని ఓ భూ ఆక్రమణ దారుడు కబ్జా చేసిన దష్ట్యా పూర్తిస్థాయిలో విచారణ జరిపించి దళిత మహిళకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ప్రజా సంఘాల ప్రతినిధులు జంగిలి భాస్కర్,భట్టు శక్రు నాయక్ తదితరులు ఉన్నారు.