Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతి పనులను సమీక్షించిన అడిషనల్ కలెక్టర్ ఇలాత్రిపాఠీ
నవతెలంగాణ-ములుగు
మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను సమర్థ వం తంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి పనుల పురోగ తిని ఆమె సమీక్షించారు. శుక్రవారం సమావేశ మందిరంలో కన్నాయిగూడెం, వాజేడు మండలాల ప్రత్యేక అధికా రులతో పల్లె ప్రగతి పనుల పురోగతిని కార్యదర్శి స్థాయిలో సమీక్షించారు. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్య తలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో తడి, పొడి చెత్త నిర్వహణ సమష్టిగా నిర్వ హించాలని, బహత్ పల్లె ప్రకతి వనాల నిర్వహణ గూర్చి సమీక్షించారు. కార్యక్రమంలో కన్నాయిగూడెం ప్రత్యేక అధికారి డీపీవో వెంకయ్య, వాజేడు ప్రత్యేక అధికారి డీసీవో సర్దార్ సింగ్, ఎంపీడీవో ఫణి చంద్ర, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.