Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా యూనియన్ (సీఐటీయూ)జిల్లా కార్యదర్శి రాజేందర్
నవతెలంగాణ-ములుగు
హైదరాబాద్ జిల్లా శాలివా హన నగర్ యూపీహెచ్సీలో పనిచేస్తున్న ఆశా వర్కర్ సుజాత పనిభారం పెరిగి, అధికారుల వేధింపులతో పనిప్రదేశంలో ఈ నెల 22న మృతి చెందిం దన్నా రు. హదయాలను కదిలించే ఇలాంటి సంఘటన కు కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, ఆమె కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఆమె పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని, అమె చావుకు కారణమైన అధికారులపై చర్యలు చేపట్టాలి సీఐటీయూ జిల్లా కార్య దర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో ఆశా యూనియన్ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా రాజేందర్ హాజరై మాట్లాడుతూ ఇటీవల ఆశాలు పని భా రం, పని ఒత్తిడితో డ్యూటీ చేస్తూ ముగ్గురు ఆశాలు మృతి చెందడంతో ఆ కుటుంబాలు అనాథలయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం ఆశా లు 106 రోజుల సమ్మె స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశాయూనియన్ జిల్లా నాయకుడు గుండెబోయిన రవిగౌడ్, జిల్లా అధ్యక్షు రాలు రత్నం నీలాదేవి, మొగిలి,రమాదేవి, మంజుల పాల్గొన్నారు.