Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పోచమ్మకుంటలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ జాతీయ స్థాయిలో ఉత్తమ సెంటర్‌గా భారత వైద్య ఆరోగ్య శాఖచే గుర్తింపు పొందిన సందర్భంగా శుక్రవారం భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజరు కుమార్‌తో పాటు ఆస్పత్రి లోని సిబ్బందిని కలిసి అభినందించారు. ఆసుపత్రికి వచ్చే రోగులపై మర్యాదపూర్వకంగా ఆరోగ్య సేవలు అందించడం ఆరోగ్య కేంద్రం పరిశుభ్రత పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండడం జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అవుతుందనే స్పూర్తితో ఆరోగ్య కేంద్రంలోని సిద్ధాంతి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రజల నుండి వచ్చే ప్రశంసలతో మరింత స్ఫూర్తిదాయకంగా మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.