Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రిం చాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కుమ్మరి సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జిల్లా కేంద్రంలోని స్థానిక రాష్ట ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయు) భవన్లో శుక్రవా రం ముఖ్య కార్యకర్తల సమా వేశం మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసాయని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రవేటు పాఠశాలల పై చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు అనుముల రాజ్ కుమార్, గుర్రం దేవరాజు ఎండీ పాషా, ప్రవీణ్ కుమార్, దిలీప్, రాకేష్, నవీన్, చందు, సాయి, యాసిన్, శ్రీకాంత్, రాజులు తదితరులు పాల్గొన్నారు.