Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయిని హైదరాబాద్లో శుక్రవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్లో వివిధ అభివద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, వరంగల్ పండ్ల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారం కొరకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా మార్కెట్లో అదనపు (రెగ్యులర్/అవుట్ సోర్సింగ్) సిబ్బందిని మంజూరు చేయాలన్నారు. ఖరీదుదారుల లైసెన్సులను త్వరగా రెన్యువల్ చేయించాలని ఎనుమాముల మార్కెట్లో పోలీస్ భవనం గురించి తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించారు. కలిసిన వారిలో వైస్ చైర్మన్ కాలేదు కరంచంద్, కమిటీ సభ్యులు గోలి రాజయ్య, పసునూరి సారంగపాణి, తుమ్మ రవీందర్ రెడ్డి, గనిపాక విజరు కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, పల్లెపాటి శాంతి రతన్రావు, కంది రవీందర్రెడ్డి, కార్యదర్శి బివి రాహుల్ పాల్గొన్నారు.