Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
దళితులకు ఆసరాగా దళిత బంధు పథకం అని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి అన్నారు. దళితబంధు పధకం ద్వారా మండలంలోని బుధరావు పేట గ్రామంలోని నిరుపేద కుటుంబాల అయిన 12 మందిని లబ్ధిదారులుగా ఎంచుకొని రూ. 1కోటి20 లక్షలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన ్రెడ్డి పంపిణీ చేశారు. సోమారపు రాజశేఖర్ ఖానాపురంలో కిరాణం, జనరల్ స్టోర్, బుధరావుపేటలో సోమారపు రవి కిరాణం, జనరల్ స్టోర్ షాపులను ఏర్పాటుచేసుకున్న సందర్భంగా లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న-సుదర్శన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతన షాపులను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు బత్తిని స్వప్న శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రమ నరసయ్య, ఎంపీటీసీ సభ్యులు షేక్ సుభాన్ బి మౌలానా, సర్పంచ్ కాస ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి రజిత, తదితరులు పాల్గొన్నారు.