Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్వో సాంబశివరావు
నవతెలంగాణ-మట్టెవాడ
వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలతో కొంతకా లంగా సమాజంలో బాలికల పెరుగుదల కనిపిస్తుందని అ దే స్ఫూర్తితో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజల్లో అవ గాహ న కార్యక్రమాలు విస్తతంగా చేపట్టాలని హన్మ కొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు సూచిం చారు. గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం పై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ తో సమీక్ష సమాy ేశాన్ని డీఎం హెచ్వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లా డుతూ స్కానింగ్ సెంటర్ల తనిఖీ, ఫామ్ అప్ ఆడిట్ పెంచడం వల్ల సమాజంలో బాలికల పెరుగుదల కనిప ిస్తున్న నందున తనిఖీలు విస్తతంగా చేపట్టడం జరుగుతుం దన్నారు. గర్భిణీలు పరీక్షల కోసం ఆసుపత్రిలకు వచ్చి నప్పుడు అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో పాటు అమ్మా యిలను, అబ్బాయిలను ఎటువంటి వివక్ష చూపకుండా సమానంగా ఆదరించాలన్నారు. అలాగే పి సి పి ఎన్ డి టి చట్టంపై గర్భిణీలకు వారి బంధువులకి అవగాహనను సిబ్బంది కల్పించాలన్నారు. కరపత్రాలు పంచుతూ కళాజాతల ద్వారా ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరించాలని అన్నారు. డాక్టర్ యాకూబ్ పాషా, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మ, డాక్టర్ నిరంజన్ దేవి, కళ్యాణి, రేవతి, రమాదేవి, పాల్గొన్నారు.