Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్ర ప్రజలు అడగకముందే వారి అవసరాలు గుర్తించి అనేక సంక్షేమ, అభివద్ధి ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభు త్వం కేసీఆర్ ప్రభుత్వమని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, పలు అభివృద్ధి పనులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.12.60లక్షల అంచనా తో నిర్మించిన స్మశానవాటికను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కర్ణకంటి స్వప్న-వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ చరిత్రలోనే 29 రాష్ట్రలాల్లో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 12769 గ్రామపంచాయతీల్లో ఏకకాలంలో ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, బీమా, వివాహ సమయంలో రూ.లక్షా 116 కానుక, పింఛన్లు, కరోనా విపత్తులో సైతం అందించిందని అన్నారు. దళితుల ఆర్థిక బలోపేతానికి దళిత బంధు అందిస్తుందని అన్నారు. ప్రతి నెల జనాభా ప్రాతిపదికన 12679 జిపీలకు ఒక్కొక్కరిపై రూ.1632 చొప్పున ఏకకాలంలో జీపీ ఖాతాల్లో జమ చేస్తున్నారని అన్నా రు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 15 వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపికలో మొదటి 10 గ్రామాలు, రెండవ 10 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుండే ఎంపికవడం కేసీఆర్ పాలనా దక్షతకు నిద ర్శనమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో పనిచేస్తే తప్పకుండా గ్రామాలు ప్రగతిపథంలో నిలుస్తా యన్నారు. నర్సరీ నిర్వహణ, హరితహారం మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రకతి వనాల వాడుక, గృహాల నుండి తడి, పొడి చెత్త సేకరణతో, సేంద్రీయ ఎరు వుల తయారీ ద్వారా పంచాయతీల ఆదాయం సమకూ ర్చుకోవడం వంటివాటిని ప్రజల్లో విస్తతమైన అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామానికి రావాలంటే రైల్వే అండర్ బ్రిడ్జిలో ప్రస్తుత కాలంలో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతోందన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, గ్రామానికి పక్కనే ఉన్న ధర్మపురం గ్రామంలో కరెంట్ వస్తుందని, తద్వారా ఫీడర్ సమస్యతో కరెంట్ సరోపోవడం లేదని అన్నారు. అదనపు ఫీడర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విమల, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, ఎంపిటిసి పాశం శిరీష సురేష్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పోలేపల్లి రంజిత్ రెడ్డి, జనగాం యాదగిరి, గుర్రపు వెంకన్న, మండల అధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్, ఉప సర్పంచ్ చిర్ర రాజు, ఎంపిఓ మధుసూదన్, డైరెక్టర్లు రాజన్ బాబు, హరీష్, సరిత, ఏఈ సందీప్, పంచాయితీ కార్యదర్శి స్నేహ, నాయకులు స్వామి, ప్రసాద్, అశోక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.