Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ
నవ తెలంగాణ-మట్టెవాడ
టీబీ వ్యాధిని అశ్రద్ధ చేయొద్దని లక్షణాలు ఉన్న వ్యక్తి నమూనాలను పరీక్ష కేంద్రాలకు పంపించి త్వరితగతిన చికిత్స అందించాలని వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ అధికారులకు సూచిం చారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన టీబీ వ్యాధి నివారణపై అధికారుల తో సమీక్ష సమావేశన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి ఒక అంటు వ్యాధి అని రోగులను వ్యాధి ప్రారంభంలో గుర్తించి చికిత్స అందించేలా అధికా రులు కృషి చేయాలని అన్నా రు. టీబీ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించాలని టీబీ వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్స అందిస్తూ వారికి మందులతో పాటు పోషణ్ అభియాన్ కింద రూ.500 వ్యాధిగ్రస్తుల బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో టీబీ వ్యాధి లక్షణాలు ఉన్న ట్లుగా గుర్తిస్తే రోగిని దగ్గరలోని పరీక్ష కేంద్రాల కు పంపాలని ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్య కర్తలు తప్పనిసరిగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. టీబి లేని సమాజం తీర్చిది ద్దడంలో ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిబి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్ సింగ్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ సూర్య ప్రకాష్, డాక్టర్ డిప్యూటీ డెమో అనిల్ కుమార్, సిసి రామలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.