Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య శుక్రవారం సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ఆదేశానుసారం ప్రతి నెల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆస్పత్రుల యందు నిద్ర చేయాలనే ఆదేశాల మేరకు శనివారం డాక్టర్ అప్పయ్య కన్నాయి గూడెం వైద్యాధికారి, డాక్టర్ నవీన్, ఆసుపత్రి, సిబ్బందితో స్థానిక పీహెచ్సీలో నిద్ర చేశారు. అలాగే శనివారం పిహె చ్సి పరిధిలోని గుట్టల గంగారంలో పర్యటించి రాబోయే సీజనల్ వ్యాధులపై అందరు అవగాహన కలిగి, తగు జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నందున అందరు తప్పకుండా మాస్కు ధరిం చాలన్నారు. గ్రామస్థులకు వైద్యాధికారి మాస్క్లు పంపిణి చేశారు. అలాగే మండల కేంద్రంలో ర్యాలీగా చేస్తూ పరిస రాల పరిశుభ్రత మలేరియా వ్యాధిపై ప్రజలకు అవ గాహన కల్పించారు. తదనంతరం వైద్య సిబ్బంది ఆశా, ఏఎన్ఎంలకు సమీక్ష సమావేశం నిర్వహించి, గర్భిణీ లు ప్రభుత్వఆసుపత్రిలో నే ప్రసవం అయ్యే విధంగా చూడాలన్నారు. సమయపాలనా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం లో ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమా వేశం స్థానిక వైద్యాధికారి డాక్టర్ నవీన్ అధ్యక్షతన నిర్వహిం చారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అప్పయ్య హాజరై మాట్లాడారు. సర్పంచ్ లలిత ఎంపీపీ సమ్మక్క, ఎంపీటీసీ నర్సక్క హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ అల్లి నవీన్, దుర్గారావు, తిరుపతయ్య సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారావు, హెల్త్ అసిస్టెంట్లు ఓం ప్రకాష్ , లక్ష్మణ్, భాస్కర్, ఫార్మాసిస్ట్ గంగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.