Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలోని సర్వే నెంబర్ 813 పరిధి లోని అంబేద్కర్ నగర్లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కళ్లెపెల్లి ప్రణయ దీప్ మాదిగ డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలని కోరుతూ మహాజన సోషలిస్టు పార్టీ, దళిత,బహుజన రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న శుక్రవారం నాటికి 20వ రోజుకు చేరుకొన్నాయి. మునిగే యాకోబు అధ్యక్షతన నిర్వహించిన ఈ దీక్షలో ప్రణయదీప్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలి వ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సర్వే నెంబర్ 813లోని ప్రభుత్వం భూమిని ఆక్రమ ణదారులకు అధికారులు కొమ్ము కా యాలని చూస్తే ఊరుకొనేది లేదని హెచ్చరి ంచారు. అప్పటిదాకా ఎన్ని నిర్భంధాలు ఎదు రైన వెనకా డేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్ దళిత, బలహీన వర్గాల రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అందె రవి, ఉద్యమ ప్రతినిధులు. లావణ్య, సన్నీ, సం పత్, రాజు బాబు, యాకోబు, గుంపుల మాల, మిట్టపల్లి రాధిక, కొండపల్లి లావణ్య, వడ్లకొండ స్వరూప, మౌనిక రాధిక, లావణ్య, రజిత, దిలీ ప్, లావణ్య, రజిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.