Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్ల ఉద్యోగంతో సైనికుడు ఎలా త్యాగం చేయగలడు..?
- రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలి
- రాకేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపెల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను వెంటనే విరమించు కోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపెల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం దబ్బీరుపేటకు చెందిన దామెర రాకేష్ ఈ నెల 17న సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన విషయం విధితమే. అతని కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి శనివారం సందర్శిం చారు. అతని కుటుంబాన్ని రాష్ట్ర ఫ్రభుత్వం ఆదుకుం టుందని, రాకేష్ సోదరుడికి ఉద్యోగం కల్పిస్తుందని తెలుపు తూ ఓదార్చారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేక రుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ఎన్నో రోజు లుగా దేశ సైనికుడు కావాలనే లక్ష్యంతో యువకులు శిక్షణలు తీసుకొని పరీక్షలు రాసి ఉద్యోగ నియమాకాలకై ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా చివరి రోజున రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రకటించి యువత నోట్లో మట్టికొట్టిందని విమర్శించారు. యువకులు ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదని, వారు ఏకంగా ఉద్యోగాలకే అర్హులు కాదని ప్రకటించడం వారి జీవితాలతో చెలగాటమాడడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమే అవుతుందన్నారు.
అగ్నిపథ్‌తో దేశ భద్రతకు ముప్పు..
దేశ రక్షణ కోసం సైన్య బలం పెంచకుండా అగ్నిపథ్ వంటి పథకం తీసుకొచ్చి సైనికుడిగా నాలుగేండ్ల ఉద్యోగం మాత్రమే ఇస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశ భక్తుడు ఎలా అవుతాడని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు తమ దేశ రక్షణకై లక్షల కోట్లు ఖర్చు పెడు తుండగా భారత ప్రభుత్వం మాత్రం సైన్యంపై ఖర్చు తగ్గిం చుకోవాలని భావించడం సిగ్గుచేటన్నారు. దేశ బడ్జెట్ లో 15 శాతం, జీడీపీలో 62 శాతం దేశ రక్షణకై ఖర్చుపెడితే తప్పే ముందన్నారు. సమీప దేశం చైనా భారత సరిహద్దు వరకు 6లైన్ల రహదారిని ఏర్పాటు చేసుకొంటుందని తెలిపారు. భారత్‌కు పాకిస్తాన్, చైనా శత్రు దేశాలతో దేశ భద్రతకు నిత్యం ముప్పు పొంచి ఉందని తెల్సి బీజేపీ ప్రభుత్వం సైన్యాన్ని పెంచుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమెరికాతో మోడీ పోల్చడం అవివేకమే అవుతుందన్నారు. కొన్నేళ్ల వరకు అత్యధికంగా ఉత్తర భారత దేశానికి చెందిన ఉత్తరఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన వారే సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చే వారన్నారు.ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ పోస్టాఫీస్ ఎకానమీ నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరువతో సైనిక శిక్షణ సంస్థలను ప్రోత్సహించడం వల్ల ఇక్కడి యువత కూడా సైనికులుగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. 2017లో హైదరాబాద్‌లో కూడా రిజిమెంట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరిందని గుర్తు చేశారు. బ్రిటీషు కాలంలో హైదరాబాద్‌లో రిజిమెంట్ ఉండేదని ఆ తర్వాత రద్దు చేశారన్నారు. అగ్నిపథ్ వల్ల తీవ్ర నష్టం ఉందని నిరూపించ డానికి తాము ఎలాంటి డిబేటిక్కైనా సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో వర్థన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్, ఫుడ్ కమిషన్ సభ్యులు భానోతు సంగు లాల్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిష్, వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్ రెడ్డి, మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, నీల శ్రీధర్, దార్ల రమాదేవి, మోతె జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.