Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని జంగేడు పీఏసీఎస్‌కు సుమారు రూ.95 లక్షల వ్యయంతో గోదామును, పీఏసీఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి చైర్మెన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నూతన గోదాం నిర్మాణంతో రైతులకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. అలాగే పీఏ సీఎస్ నూతన భవనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సహాయం అందరూ చేస్తున్నారని తెలిపారు. రైతులకు రైతు బీమా, రైతు రుణాలు లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతును రాజుగా చూడాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు.
నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
సముదాయించిన ఎమ్మెల్యే గండ్ర
రైతుల నిమిత్తం నిర్మించనున్న పీఏసీఎస్ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విశాలమైన స్థలంలో ఏళ్ల తరబడి బొడ్రాయి ప్రతిష్టా తపాటు సద్దుల బతుకమ్మ దసరా వేడుకలు నిర్వహిస్తున్నామని, వేరే చోట నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడు తున్నట్టు తెలిపారు. కొందరు నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ముందు పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
పోలీస్ పహారా మధ్య శంకుస్థాపన...
భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని జంగేడు లో పీఏసీఎస్ భవన నిర్మాణ శంకుస్థాపన వివాదా స్పదంగా మారింది. భవనాన్ని నిర్మించోద్దంటూ గ్రామస్తులు ముందుగానే స్థలానికి చేరుకోగా సమా చారం అందుకున్న సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు నరేష్, రామకష్ణ, స్వప్న, సిబ్బంది ఆటంకం జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కార్య క్రమంలో డీసీఓ మద్దిలేటి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, జెడ్పి వైస్ చైర్పర్సన్ శోభ రఘుపతిరావు, జిల్లా రైతు సమితి నాయకుడు ముద్దమల్ల భార్గవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్, బండారి రవి, మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజారెడ్డి, కౌన్సిలర్లు సిరుప అనిల్, జక్కం రవికుమార్, మేకల రజిత, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, పానుగంటి హారిక శ్రీనివాస్, సజ్జనపు స్వామి, ముంజలా రవీందర్‌గౌడ్, పిల్లలమర్రి శారద నారాయణ, టీజే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.