Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసె వాసులకు అండగా బీఎస్పీ
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-మట్టెవాడ
అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు గడుస్తున్నా పేదలకు ఇచ్చిన హామీలైన రెండు పడకల గదుల నిర్మాణం పూర్తి చేయకపోగా తలదాచుకోడానికి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వారిపై దౌర్జన్యం చేయడం అన్యాయమని బహుజన సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం ఖిలావరంగల్ మం డలం జక్కలొద్దిలో గుడిసె వాసులను కలుసుకున్న ఆయన పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలపై జరిపించిన బుల్డోజర్ దాడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని, మాయమాటలు చెప్పి నీళ్లునిధులు, ఇల్లులు అని మురిపించి రెండు సార్లు అధికారం చేపట్టి పేదలకు ఇచ్చిన హామీల లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదని మండిపడ్డారు. రెండు పడకల గదుల్లో పేదలను ఉంచుతానని ప్రగల్బా లు పలికి ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూములు కేటా యిం చిన దాఖలాలు లేవని అన్నారు. వం ద రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టానని రాష్ట్రంలో ఒక్క పేద వాడికి కూడా సొంతింటి కల నెరవేరలేదని అన్నా రు. వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రికి పేదల కోసం ఇల్లు కట్టడానికి నిధులు లేవా అని అన్నారు. వరంగల్ నగరంలో 42 రోజులుగా ఉంటున్న పేదలపై పోలీసుల దౌర్జన్యం క్షమించరానిదని ఇక్కడున్న పేదలకు ఇష్టాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 70 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారం చేపట్టిన పేదలకు న్యా యం చేయలేదని తాము అధికారంలోకి వస్తే పేదల సమ స్యలను నెరవేరు స్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బిఎస్పి నాయకులు గుడిసె వాసులు పాల్గొన్నారు.