Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి
- శానిటరీ ఇన్స్పెక్టర్ల ర్యాలీ
నవతెలంగాణ-హనుమకొండ
సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి కోరారు. హన్మకొండలోని మున్సిపల్ గెస్ట్‌హౌజ్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్లతో శనివారం నివ్రహించిన సమావేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్ములనపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకం నిషిద్ధమన్నారు. జులై 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని చెప్పారు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి వాడి పారేసే పల్చటి (120 మైక్రాన్ల కంటే తక్కువ మందం) ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో అమలు చేయడానికి సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్లాస్టిక్ నిషేధం పటిష్ఠ ఆమలుకు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారి నుంచి జరిమానా వసూలు చేస్తామన్నారు. జలవనరులు, ప్రధాన డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడానికి, ఇతరత్రా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ విక్రయిస్తూ పట్టుబడితే రూ.2500ల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని, నిషేధించిన ప్లాస్టిక్ బ్యాగులను ఎక్కడపడితే అక్కడ పారేసే వ్యక్తులపై రూ.250లు నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తామని వివరించారు. ఈ సందర్భంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యావరణాన్ని పరిక్షించాలని కోరుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, భాస్కర్, వావ్ ప్రతినిధి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.