Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని హనుమకొండ డిపో మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ కాయిత మాధవరెడ్డి అధ్యక్షతన ప్రయాణికులకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎం మాట్లాడారు. ప్రయాణికులను చైతన్యవంతం చేశారు. ప్రజల సూచన మేరకు వేలేరు నైట్ హాల్ట్, పికెట్ బస్సుల పునరుద్ధరణ విషయమై ఆలోచిస్తామన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించొద్దని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ ఉష, వార్డు సభ్యుడు జోగు ప్రసాద్, ఆర్టీసీ కళాజాత సిబ్బంది సాంబయ్య, శంకర్, రాజు, శ్రీనివాస్, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, ఎల్లస్వామి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.