Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రజావ్యతిరేక నిర్ణయాలతో దోపిడికి పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పిలు పుని చ్చారు. రామన్నపేట జోన్ రఘునాథ కాలనీ లోని పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీ య శిక్షణ తరగతులు రెండు రోజు లుగా జరుగు తున్నాయి. అందులో భాగంగా మొ దటి రోజు శనివారం ముఖ్య అతిథిగా విచ్చే సిన ఆయన శిక్షణ తరగతులను ప్రారంభించి సభను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం బడాబాబులకు దోచిపెట్టే విధానాలకు తెరలేపి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం లో భూములను బూర్జు వా పెట్టుబడి దారులకు దోచుపె డుతూ పేద ల కడుపు కొడు తున్నారని ఈ విధానాలను సిపిఎం పార్టీ ప్రజా పోరాటాల ద్వారా తిప్పి కొట్టడానికి సిద్ధం అయిం దని ఈ పోరా టాలలో ప్రతి ఒక్క రు ముం దుకు రావా లని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నలగంటి రత్నమాల, సింగారపు బాబు, ఆరూరి కుమార్, రామ స్వామి, ఎం. సాగ ర్, ఎండ. ిబషీర్, యాదగిరి, రమేష్, సుమన్, శ్రీని వాస్, చుక్కయ్య, విజయ, సంగీత, దుర్గయ్య, గోవర్ధన, ఓదెలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.