Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ సీఈఓ శోభారాణి
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని సూరారం, మహాదేవ్‌పూర్, కుదురుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి పంపులను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చేపట్టిన నీటి సంపు నిర్మాణాన్ని ఎంపీపీ రాణిబాయి రామారావు, జెడ్పీటీసీ గుడాల అరుణతో కలిసి సీఈఓ శోభారాణి ప్రారంభించారు. అనంతరం కుదురుపల్లి, సూరారంల్లోని ప్రభుత్వ పాఠశాలలో నీటి సంపు నిర్మాణాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలల్లో తాగునీటి, విద్యుత్, టాయిలెట్లు, ఇతర మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించిందని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో సంపు నిర్మాణ పనులకు సీఈఓ మార్కింగ్ చేసి మాట్లాడారు. ఆమె వెంట ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ ప్రసాద్, సర్పంచ్‌లు శ్రీపతి బాపు, నాగుల లక్ష్మారెడ్డి, తోట లక్ష్మీ సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, పీఆర్ డీఈ సాయిలు, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.